కొర్రలతో లెమన్ రైస్
కావలసిన పదార్థాలు:
కొర్రలు - 100 గ్రా.,
నూనె - 20 గ్రా.,
పచ్చిమిర్చి - 5 గ్రా.,
కరివేపాకు - 3 గ్రా.,
పసుపు - 2 గ్రా.,
ఆవాలు - 2 గ్రా.,
నిమ్మ రసం - తగినంత,
వేరుశనగ పప్పు - 10 గ్రా.
తయారీ విధానం:
కొర్రలు శుభ్రంగా కడిగి రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత కుక్కర్‌లో వేసి, రెండు కప్పులు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. కొర్రన్నం చల్లబడ్డాక నిమ్మరసం కలపాలి. బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, తరిగిన పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, వేరుశనగ పప్పు వేగించి కొర్ర అన్నంలో కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చేర్చాలి. చక్కని ఫలహారంగా పనికొస్తుంది.
పోషక విలువలు:
100 గ్రా.ల ఈ పదార్థంలో శక్తి 365.76 కి. కెలోరీలు,
ప్రొటీన్ 11.6 గ్రా.,
కొవ్వు 20.40 గ్రా.,
కాల్షియం 48.8 మి.గ్రా.,
భాస్వరం 210.27 మి.గ్రా,
ఇనుము 3.5 మి.గ్రా.
No comments:
Post a Comment