కేక్
కావలసిన పదార్థాలు:
కొర్రలు - 100 గ్రా.,వెన్న - 75 గ్రా.,
పంచదార పొడి - 75 గ్రా.,
గుడ్లు (2) - 100 గ్రా.,
బేకింగ్ పౌడర్ - తగినంత.
తయారీ విధానం:
ముందుగా కొర్రపిండిలో బేకింగ్ పౌడర్ వేసి జల్లించుకోవాలి. తర్వాత గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన విడివిడిగా గిలకొట్టాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్‌లో పంచదార పొడి, వెన్న, గుడ్ల సొనలు, కొర్రపిండి వేసి అన్నీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్రీస్ చేసుకున్న బేకింగ్ మౌల్డ్‌లో వేసుకోవాలి. ముందుగా 160 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు వేడి చేసుకున్న ఒవెన్‌లో పెట్టి 190 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 25 నిమిషాలు బేక్ చేసుకోవాలి.పోషక విలువలు:
100 గ్రా.ల ఈ పదార్థంలో శక్తి 437 కి. కెలోరీలు,ప్రొటీన్ 7.3 గ్రా.,
కొవ్వు 22.3 గ్రా.,
కాల్షియం 28.5 మి.గ్రా.,
భాస్వరం 145.7 మి.గ్రా.
ఇనుము 1.43 మి.గ్రా.
No comments:
Post a Comment