Tuesday, September 24, 2019

6 Millet Recipes For Weight Loss

6 Millet Recipes For Weight Loss



Millets are extremely good for us specially if we are on the road to fitness.  One of the most commonly available Millet is foxtail Millet also called kangni it’s very healthy as it’s high in fibre, protein and vitamins and minerals like iron, calcium, copper etc. therefore these recipes are not only delicious but highly nutritious. So, it’s time to take a break from usual breakfast, lunch or dinner recipes and replace it with these Millet recipe.

Monday, September 9, 2019

కొర్రల ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌

కొర్రల ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌



కావలసిన పదార్థాలు


కొర్రలు - 100 గ్రా.,
గుడ్లు - 3,
ఉల్లిపాయలు - 250 గ్రా.,
 టమాట - 20 గ్రా.,
పచ్చిమిర్చి - 6 గ్రా.,
వెల్లుల్లి - 5 గ్రా.,
అల్లం - 5 గ్రా.,
నూనె - 30 మి.లీ.,
ఉప్పు - తగినంత.

 

తయారీ విధానం


కొర్రలను ముందుగా శుభ్రంగా కడిగి 2 గంటలు నానబెట్టాలి. కుక్కర్‌లో కొర్రలతో పాటు రెండు కప్పుల నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. ఇప్పుడు బాండీలో నూనె పోసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలో గిలకొట్టి పై మిశ్ర మంలో కలిపి వేగించాలి. తరువాత కొర్ర బాత్‌ను వేసి బాగా కలపాలి.

పోషక విలువలు: 

100 గ్రాముల, ఈ పదార్థంలో శక్తి 258.18 కి.కెలోరీలు, ప్రొటీన్లు 10.1 గ్రా., కొవ్వు 16 గ్రా., కాల్షియం 40.6 మి.గ్రా., భాస్వరం 196.9 మి.గ్రా., ఇనుము 2.09 మి.గ్రా.

Tuesday, September 3, 2019

కషాయాలతో ఆటకట్టు

కషాయాలతో ఆటకట్టు


కషాయం అనగానే ఏదో కపాలానికి తాకినట్లే అనిపిస్తుంది. తేనీరు కూడా కషాయమే కదా మరి? దానికి ఏమనుకోవాలి? టొమాటో సూప్‌, ఉలవచారు, చింతపండు రసం ఇవన్నీ కషాయాలే ! ఆరోగ్యం మెరుగవ్వాలంటే రుగ్మతకు తగిన ఔషధ కషాయం తాగాల్సిందే!

బాహ్య కషాయాలు!

కషాయం రూపంలో తీసుకునే ఆయుర్వేద ఔషధాలు రెండు రకాలు. ఒకటి అంతర్గతంగా తీసుకునేవి, మరొకటి బాహ్యంగా వాడేవి. ఆయుర్వేదం ఇలాంటి వేల రకాల ఔషధ కషాయాల్ని తయారు చేసింది. ఉదాహరణకు వేడినీళ్లల్లో వావిలాకు వేసుకుని స్నానం చేయడం అనాదిగా వస్తున్న అలవాటే కదా! ఈ స్నానం వల్ల ఒంటి నొప్పులు తగ్గుతాయి. ఇవీ కషాయాలే! కాకపోతే బాహ్యమైనవి. ఎగ్జిమా, సొరియాసిస్‌ లాంటి వ్యాధులు ఉన్నవాళ్లు మరిగే నీళ్లల్లో వేపాకు వేసి, ఆ నీళ్లతో స్నానం చేస్తారు. కుంకుడు కాయల్ని కూడా వేడినీళ్లల్లో వేసి స్నానం చేస్తే, కొన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గే అవకాశం ఉంది.

కొన్ని రకాల మూలికల్ని చూర్ణాలుగా చేస్తేనే మేలు. మరి కొన్నింటిని మాత్రం కషాయమే చేయాలి! ప్రయోజనాలు అనేవి మూలికల మూలకాల మీదే కాదు. కషాయాల తయారీ పైన కూడా ఆధారపడి ఉంటాయి. మూలికల ప్రత్యేకతలు, వివిధ ప్రయోజనాల ఆధారంగా కషాయాలు తయారు చేసుకోవాలి. రుగ్మత స్వభావం, తీవ్రతలను బట్టి ఇంటిపట్టునే తయారుచేసుకోగలిగే కషాయాలు బోలెడన్ని!

థైరాయిడ్‌ సమస్యలకు

థైరాయిడ్‌ సమస్య సర్వసాధారణమైపోయింది. థైరాక్సిన్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులకు లోనుకాకుండా సజావుగా విడుదలవ్వాలంటే థైరాయిడ్‌ గ్రంథిని సక్రమంగా పనిచేయించే కషాయం తీసుకోవాలి. ఇందుకోసం ధనియాల కషాయం వాడాలి.

కావలసిన దినుసులు

ధనియాలు - ఒక చెంచా
త్రికటు చూర్ణం (శొంఠి, మిరియాలు, పిప్పళ్లు) - అర చెంచా
నీళ్లు - ఒక గ్లాసు

తయారీ ఇలా!

ఈ కషాయం రెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు!
శీతల కషాయం: ధనియాలు దంచి రాత్రివేళ చల్లని నీళ్లలో వేసి ఉదయాన్నే వడబోసుకొని తాగాలి.
వేడి కషాయం: ధనియాలను దంచి రాత్రివేళ వేడినీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే వడబోసుకొని తాగాలి.
ఇలా తాగలేనివాళ్లు నీళ్లకు బదులు శీతలపానీయంలో ధనియాల పొడి, త్రికటు చూర్ణం కలిపి తాగవచ్చు.

కంటి చూపు కోసం...

ఇది బాహ్య కషాయం. కంటి సమస్యలు, చూపు మందగింపు లాంటి ఇబ్బందులు ఈ కషాయంతో తొలగుతాయి.

కావలసిన దినుసులు

త్రిఫల చూర్ణం - రెండు స్పూన్లు
నీళ్లు - తగినన్ని  

తయారీ విధానం
నీళ్లలో త్రిఫల చూర్ణాన్ని కలిపి, నాలుగో వంతు వచ్చేవరకూ మరిగించి చల్లార్చాలి.
ఈ కషాయాన్ని వడగట్టి ఉంచుకోవాలి.
అడుగున పేరుకున్న గసి కాకుండా, పైన తేలిన నీటితో కళ్లను కడుక్కోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది.
త్రిఫల చూర్ణాన్ని పొట్టలోకి తీసుకున్నా కంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి భోజనం తర్వాత ఈ కషాయాన్ని నెల రోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

కిడ్నీ సమస్యలకు

కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలకు బాగా పనిచేస్తుంది. కిడ్నీలకు సంబంఽధించి సాధారణంగా యూరినోబ్లాడర్‌ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్‌ లెవల్‌ పెరగడం, కిడ్నీ పనితనం తగ్గడం, వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలకు కొత్తిమీర కషాయం చక్కగా పని చేస్తుంది.

కావలసిన దినుసులు

కొత్తిమీర - గుప్పెడు
నీళ్లు - 1 గ్లాసు

తయారీ విధానం

నీళ్లలో కొత్తిమీర వేసి మరిగించాలి.
నీళ్లు నాలుగో వంతు వచ్చేవరకూ మరిగించి, చల్లార్చాలి.
ఈ కషాయాన్ని రోజుకి రెండు పూటలు తీసుకోవాలి.
ఇలా వరుసగా 40 రోజులు వాడి, ఓ 10 రోజులు మానేసి మళ్లీ తాగడం మొదలెట్టాలి. ఇలా చేస్తే పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.

పరిణామ శూలకు

అన్నం తిన్న రెండు మూడు గంటల తర్వాత కొందరికి కడుపులో నొప్పి వస్తుంది. దీన్ని పరిణామ శూల అంటారు. తిన్న ఆహారం జీర్ణాశయం దాటి ఎప్పడైతే బయటికి వస్తుందో అంటే డియోడినం (చిన్న పేగు పారంభం)లో ఏదైనా అల్సర్‌ ఉంటే నొప్పి వస్తుంది.

కావలసిన దినుసులు

శొంటి - 1 చెంచా
నల్ల నువ్వులు - 1 చెంచా
బెల్లం - 1 చెంచా ఫ పాలు - కొద్దిగా
నీళ్లు - సరిపడా

తయారీ విధానం

ఈ మూడింటినీ మెత్తగా నూరి, కల్కం అంటే పేస్ట్‌లా చేసుకోవాలి.
పేస్టుకు నీళ్లు జోడించి, పాలు కలుపుకోవాలి.
ఈ మిశ్రమంతో కషాయం తయారుచేసి, ఏడు రోజులపాటు రెండు పూటలా తీసుకోవాలి.
ఇలా చేస్తే సమస్య 90 శాతం దాకా తగ్గుతుంది. రెండు రోజుల్లోనే ఉపశమనంగా అనిపించినా 7 రోజుల దాకా కొనసాగించాలి.

నోటి పూతకు

నోటి పూతకు మందు త్రిఫల చూర్ణంలో ఉంది. ఇందుకోసం కషాయం తయారు చేసుకోవాలి.

కావలసిన దినుసులు

త్రిఫల చూర్ణం - 2 చెంచాలు
మల్లె ఆకులు - గుప్పెడు
ఎండు ద్రాక్ష - గుప్పెడు
నీళ్లు - 1 గ్లాసు

తయారీ విధానం

నీళ్లలో త్రిఫల చూర్ణం, మల్లె ఆకులు, ఎండు ద్రాక్ష వేసి మరిగించాలి.
కషాయం తయారయిన తర్వాత వెంటనే తాగకుండా, ముందు కొంత కషాయంతో నోరు పుక్కిలించాలి.
ఆ తర్వాత తాగాలి.

పచ్చ కామెర్లకు

కామెర్లు త్రిఫల కషాయంతో తగ్గుతాయి. ఇందుకోసం..

కావలసిన దినుసులు

త్రిఫల చూర్ణం - 2 చెంచాలు
వేప బెరడు - కొద్దిగా
తిప్ప తీగ - కొద్దిగా
నీళ్లు - సరిపడా
తయారీ విధానం
నీళ్లలో త్రిఫల చూర్ణం, తిప్ప తీగ, వేప బెరడు వేసి రాత్రంతా నానబెట్టాలి.
ఉదయం వేళ ఈ కషాయాన్ని వడగట్టి, కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి.

రుతుక్రమం సక్రమం

కొందరికి రుతుక్రమం క్రమం తప్పుతుంది. స్రావంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇలాంటివాళ్లకు నువ్వుల కషాయం ఉంది.

కావలసిన దినుసులు

నల్ల నువ్వుల పొడి - 2 చెంచాలు
నీళ్లు - 300 మిల్లీ లీటర్లు
బెల్లం - రుచికి సరిపడా

తయారీ విధానం

నీళ్లలో నల్ల నువ్వుల పొడి వేసి ముప్పావు వంతు వచ్చేవరకూ మరిగించాలి.
ఈ నీళ్లలో బెల్లం కలిపి, వడగట్టి బహిష్టు మొదలయ్యేవరకూ రెండు పూటలా తాగాలి.
బహిష్టు వచ్చిన రోజుకు మూడు వారాల తర్వాత మళ్లీ అలాగే చేయాలి.
అలా మూడు నాలుగు మాసాల పాటు చేస్తే రుతుక్రమం చక్కబడుతుంది.

జలుబు, దగ్గు

శ్వాసపరమైన సమస్యలకూ కషాయాలున్నాయి. వాటిలో పిప్పళ్ల కషాయం మేలైనది.

కావలసిన దినుసులు

శొంఠి - అర చెంచా
మిరియాలు - 1 చెంచా
పిప్పళ్లు - 1 చెంచా
నీళ్లు - సరిపడా
 
తయారీ విధానం

నీళ్లలో పిప్పళ్లు, సొంఠి, మిరియాలు వేసి మరిగించి, చల్లార్చాలి.
ఈ కషాయాన్ని రెండు పూటలు తాగితే జలుబు, దగ్గు, ముక్కు దిబ్బెడ తగ్గుతాయి.

శరీర అంతర్భాగాల్లో పుండ్లు

నోటి నుంచి మలద్వారం వరకూ ఉండే శరీర అంతర్భాగాల్లో అల్సర్లకు అతిమధురం దివ్యౌషధం. ఈ కషాయం కోసం....

కావలసిన దినుసులు

అతిమధురం - సరిపడా
పాలు - 50 మిల్లీ లీటర్లు
నీళ్లు - 400 మిల్లీ లీటర్లు

తయారీ విధానం

నీళ్లలో పాలు, అతిమధురం కలిపి మరిగించాలి.
వడగట్టి సేవించాలి.

కషాయ నియమాలు ఇవే!

అందుబాటులో ఉన్నంత వరకు తాత్కాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా వేటికైనా కషాయాలు వాడవచ్చు.
ఏ కషాయమైనా పరగడుపునే తీసుకోవాలనేది ఒక మౌలిక సూత్రం. అంటే, ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా భోజనానికి కనీసం అరగంట ముందు తీసుకోవాలి.
కషాయాల్లో కొన్ని రెండు మూడు రోజులు లేదా వారం మాత్రమే వాడుకునేవి ఉంటాయి. మరికొన్ని ఇతర కషాయాలు దీర్ఘకాలం పాటు వాడుకునేవిగా ఉంటాయి.
దీర్ఘకాలం పాటు వాడాల్సి ఉన్నప్పుడు వరుసగా 40 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా వాడాల్సి వస్తే, మధ్యలో ఓ 10 రోజుల పాటు మానేసి, ఆ తర్వాత మళ్లీ 40 రోజుల పాటు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కాలం వాడాల్సి వచ్చినప్పుడు కూడా మధ్య మధ్యలో ఓ వారం 10 రోజులు గ్యాప్‌ ఇవ్వాలి. మధ్య మధ్య అలా ఆపకపోతే, శరీరం ఆ మందులకు బాగా అలవాటుపడిపోయి, ప్రతిస్పందించడం మానేస్తుంది.
కషాయాల్ని రెండు పూటలా తీసుకోవలసి ఉంటే రోజూ రెండుసార్లు తయారు చేసుకోవడం కష్టమే అవుతుంది. అలాంటి వారు, ఉదయమే రెండు పూటలకు సరిపడా తయారు చేసుకోవవచ్చు. ఉదయం అందులోంచి సగ భాగం తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగే యాలి. మిగతా సగభాగాన్ని ఆరేడు గంటల వ్యవధిలో అంటే సాయంత్రం తీసుకోవచ్చు. కాకపోతే, కషాయాన్ని గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఏ కషాయాన్నయినా చల్లగా ఎప్పుడూ తాగకూడదు.
కాస్త వెడల్పయిన పాత్రలో 500 మి.లీ. నీళ్లు తీసుకొని, నాలుగు చెంచాల పొడి కలిపి సన్నని మంటపైన ఉంచాలి. ఉడకబెట్టేటప్పుడు మూత తీసి ఉంచాలి. ఆ నీళ్లు నాలుగో వంతు మిగిలేదాకా మరిగించి చల్లార్చాలి. పల్చని వస్త్రంతో లేదా సన్నని టీ-ఫిల్టర్‌తోనూ వడబోయవచ్చు.